ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి :  కలెక్టర్ క్రాంతి 

 ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి :  కలెక్టర్ క్రాంతి 
  • ప్రజావాణిలో కలెక్టర్ క్రాంతి 

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ క్రాంతి ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి 56 మంది అర్జీలు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం గ్రామ సభల నిర్వహణపై అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.

గ్రామసభలు కచ్చితంగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. అర్హుల జాబితాను జీపీ నోటీస్ బోర్డులో ప్రచురించాలని, గ్రామ సభలో వచ్చే అభ్యంతరాల దరఖాస్తుల స్వీకరించాలన్నారు. గ్రామసభల తీర్మాన ప్రతులను సురక్షితంగా భద్రపరచాలని 
సూచించారు.

మెదక్ : ప్రజావాణికి వచ్చిన అర్జీలను పరిశీలించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అడిషనల్​ కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. మెదక్​కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి102 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వాటిలో ధరణి-కి సంబంధించి38, ఇందిరమ్మ ఇండ్లు 11, రుణమాఫీ- 3,  రేషన్ కార్డులు 10, ఇతర సమస్యలపై -40 అర్జీలు వచ్చినట్లు చెప్పారు.